యూట్యూబ్ లో 2.ఓ టీజర్ రికార్డు

SMTV Desk 2018-09-15 17:16:23  Rajinikanth, 2.0, Teaser, Akshay Kumar

హైదరాబాద్‌: సూపర్ స్టార్ రజిని, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ టీజర్ వినాయక చవితి సందర్భంగా గురువారం ఉదయం 9 గంటలకు రిలీజ్ చేశారు. రిలీజైన నాటి నుండి యూట్యూబ్ లో 2.ఓ టీజర్ సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉంది. గంటకో రికార్డ్ చొప్పున రజిని స్టామినా ప్రూవ్ చేసేలా రికార్డుల మోత మోగిస్తుంది 2.ఓ. టీజర్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 36 గంటలవుతుంది. ఈ టైంలో తమిళ వర్షన్ 12 మిలియన్స్ కు రీచ్ అవుతుండగా.. తెలుగు వర్షన్ 6 మిలియన్స్ కు దగ్గరలో ఉంది. అంటే కేవలం రోజున్నరలోనే 2 కోట్ల వ్యూస్ సాధించింది ఈ టీజర్. 48 గంటల్లోగా ఈ లెక్క డబుల్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రజిని నటించిన రోబో సినిమాకు సీక్వల్ గా వస్తున్న ఈ 2.ఓ సినిమా టీజర్ తోనే అంచనాలను పెంచేశారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ ఇయర్ నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ ఆఫ్టర్ రిలీజ్ ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.