నోటా ట్రైలర్ విడుదల తేదీ ఖరారు

SMTV Desk 2018-09-03 19:15:25  Nota, Vijay devarakonda,

‘గీత గోవిందం’చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న మరో చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ‘ఇరుముగన్ ‘ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న’ నోటా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్ .. సంచన నటరాజన్ నటిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. ట్రైలర్ తోనే అంచనాలు అమాంతంగా పెరిగేలా దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ప్రముఖ నటులు సత్య రాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి .