" నాటకం” టీజర్‌ విడుదల

SMTV Desk 2018-09-03 18:21:20  Natakam teaser, natakam,

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న”నాటకం” సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇది పల్లెటూరు వాతావరణంలో వస్తోన్న మరో బోల్డ్ ప్రేమకథా చిత్రం అని అర్థమైపోతోంది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ‘ఆర్స్ఎక్స్100’ను మించి ఉన్నాయి. ‘ఒక్కసారి తప్పు జరిగితే ఇక ఎన్నిసార్లు జరిగినా తప్పు కాదు’ వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. అయితే హీరోహీరోయిన్ల పాత్రలను చూస్తుంటే తమిళ చిత్రాలు గుర్తొస్తున్నాయి. బాల కోటేశ్వరరావు, పార్వతి అనే గ్రామీణ జంట మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రం. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్నీ రకాల ఎలిమెంట్స్‌ను కలగలిపి ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెలాఖరులో ‘నాటకం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.