హీరోగా రానున్న రకుల్ ప్రీత్ తమ్ముడు

SMTV Desk 2017-07-17 17:45:57  RAKUL PREETH SINGH, BROTHER, MOVIE, SHORT FILM, ROCK AND ROLE , FIRST LOOK

హైదరాబాద్, జూలై 17 : తన మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తోనే మంచి నటిగా గుర్తింపు పొంది నేటి అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగుతున్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్. ఇప్పుడు ఆమె చిన్న తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా నటుడిగా పరిచయం కాబోతున్నారు. అమన్ కీలక పాత్రలో ఓ లఘు చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీలుక్‌ ను విడుదల చేశారు. ఆ వీడియో ను రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. "నీ ఫస్ట్ మూవీ కి ఆల్ ద బెస్ట్‌ బ్రదర్. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి "రాక్ అండ్ రోల్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.