అన్నను చూస్తుంటే నాన్ననే చూస్తున్నట్టు వుండేది : నందమూరి బాలకృష్ణ

SMTV Desk 2018-08-29 19:58:11  balakrishna,harikrishna,accident,tdp,ntr

మెహిదీపట్నంలో హరికృష్ణ భౌతికకాయం వద్ద మీడియాతో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేకపోవడం తనకు, తమ కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని ఇది చాలా బాధకరమైన సంఘటన అని అన్నారు. హరికృష్ణకు బంధుప్రీతి ఎక్కువని, మా ఊరు వెళ్లినప్పుడు ప్రతి ఒక్క బంధువును కలిసి, పలకరించేవారని. అలాగే, పార్టీలో కూడా అందరితోను కలుపుగోలుతనంగా ఉండేవారని, అటువంటి ఆయన మన మద్యలేరంటే లేరంటే నమ్మబుద్ధి కావడం లేదని భావోద్వేగంతో ఆయన చెప్పారు. సంస్కృతీ సంప్రదాయాలకు హరికృష్ణ విలువ ఇచ్చేవారని ,తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వస్తుండేవారని, హరికృష్ణ అన్నయ్యను చూస్తుంటే తమ తండ్రినే చూస్తున్నట్టే ఉండేదని అన్నారు. అందరూ పోవాల్సిన వాళ్లేమని, కానీ, ఈవిధంగా చనిపోవడం బాధాకరంగా ఉందని, నమ్మబుద్ధి కావడంలేదని బాధాతప్త హృదయంతో బాలకృష్ణ చెప్పారు.