కేరళకు లారెన్స్‌ సాయం

SMTV Desk 2018-08-24 11:43:42  Kerala, Kerala Victims, Raghava Lawrence

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. హీరో కం డ్యాన్సర్ రాఘవ లారెన్స్. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు. కేరళ వరద బాధితులకు తనవంతుగా కోటి రూపాయలు సాయమందించారు. అలాగే బియ్యం, కూరగాయలు కూడా కేరళకు పంపించారు. అంతేకాదు కేరళకు స్వయంగా వెళ్లి, అక్కడి ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా తెలిపాడు. వరదల్లో కేరళ ప్రజల కష్టాలు తనను కలచివేశాయని ఈ సందర్భంగా లారెన్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌ను శనివారం కలిసి చెక్‌ను అందజేస్తానని తెలిపారు. బాధితులు ఎవరైనా తనను వ్యక్తిగతంగా కలిస్తే, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే.