క్షమాపణ చెప్పిన తాప్సీ

SMTV Desk 2017-07-15 16:47:04  TAPSEE, RAAGAVENDRARAO, JUMMANDINAADAM, COMEDY SHOW, COCONUT, FORGIVE

ముంబై, జూలై 15 : ‘ఝుమ్మందినాదం’ చిత్రంతో రాఘవేంద్రరావు తాప్సీని కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇటీవల తాప్సీ ఓ కామెడీ షోలో పాల్గొని దర్శకుడు రాఘవేంద్రరావు నాభిపై కొబ్బరికాయ వేయించారని, అందులో ఏం అందం ఉందో తనకైతే అర్థం కాలేదని చెప్పింది. దీంతో నెటిజన్లు మండిపడుతూ ఆమె మాట్లాడిన తీరు బాగోలేదంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారు. దీనిపై స్పందించిన తాప్సీ, రాఘవేంద్రరావుకు క్షమాపణ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి రాఘవేంద్రరావు గారు కారణమని, దాన్ని ఎప్పటికీ మరిచిపోనని వారిని బాధించడం తన ఉద్దేశం కాదన్నారు. అందరు ఆయనను అవమానించానని ఆరోపించడం వింతగా ఉందని తెలిపారు. కానీ తాను ఆ పని చేయలేదని, ఎప్పటికీ చేయనని పేర్కొన్నారు. కేవలం తన గురించి తాను హాస్యాస్పదంగా మాట్లాడుకున్నానని, దానికి మించి ఏమీ లేదని తెలిపారు. ఈ క్రమంలో పొరపాటున ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని తాప్సీ వీడియోలో కోరారు.