వైరల్ : చేగువేరా పక్కన పవన్ కూతురు..

SMTV Desk 2018-07-07 12:29:41  pawan kalyan, cheguvera, pawan daughter polena.

హైదరాబాద్, జూలై 7 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయాలనే గట్టి సంకల్పంతో సినిమాలు వీడి రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కు విప్లవకారుడు చేగువెరాకు వీరాభిమాని. తన ప్రసంగాలలో అప్పుడప్పుడు చేగువెరా ప్రస్తావన తీసుకొస్తారు. తాజాగా పవన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పవన్ త‌న కూతురు పొలినా.. ర‌ష్యాలో చేగువెరా విగ్ర‌హం ప‌క్క‌న నిల్చుని తీయించుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో.. "సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ మ్యూజియ‌మ్‌లో ఉన్న చేగువెరా మైన‌పు విగ్ర‌హం ప‌క్క‌న నిల్చుని నా కూతురు పొలినా అంజ‌నీ ఫోటోకు ఫోజిచ్చింది. నేను ఇంట‌ర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో చేగువెరా గురించి మొద‌టిసారి చ‌దివాను. అప్ప‌ట్నుంచి ఆయ‌న నా జీవితంలోకి వ‌చ్చిన‌ట్టు అప్పుడ‌ప్పుడు ఫీల‌వుతుంటాను. ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌ని నేను ఆశ్చ‌ర్య‌పోతుంటాను" అంటూ ట్వీట్ చేశారు.