సినీ ప్రముఖులకు నోటీసులు

SMTV Desk 2017-07-14 17:17:19  Drugs, Notices, for, film, personalities,

హైదరాబాద్, జూలై 14 : డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు నోటిసులు పంపడం కలకలం రేపుతుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ ను అధికారులు విచారిస్తున్నారు. ఇందులో కొంత మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. కెల్విన్ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ ఆధారంగా అధికారులు విచారణ జరిపారు. అతనితో సంబంధమున్న వారందరికి నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా వారిలో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిని ఈ నెల 12 నుంచి 27 వరకు విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే తేడా లేకుండా మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిని విచారించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు రంగం సిద్దం చేస్తున్నట్లు వినికిడి. ఇందులో రవితేజ, నవదీప్, తరుణ్, తనిష్, నందు, సుబ్బరాజు, హీరోయిన్ ఛార్మి, ముమైత్ ఖాన్, డైరెక్టర్ పూరి జగన్నాధ్, కెమెరా మాన్ ఛోట కె నాయుడు తదితరులు ఉన్నట్లు సమాచారం.