హైదరాబాద్, జూన్ 12 : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసన ఆడిపాడింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని పెద్ద సినిమాలు చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రకుల్‌కు అవకాశాలు సరిగా లేవనే చెప్పాలి. దక్షిణాదిలో అవకాశాలు తగ్గినా అమ్మడుకి క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. బాలీవుడ్ నుంచి పిలుపులు అందుకుంటోంది. పలు ఈవెంట్స్ కు కూడా అటెండ్ అవుతూ వస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో "అయ్యారే" చిత్రంలో నటించిన రకుల్.. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సినిమాలో కూడా రకుల్ నటిస్తోంది. అయితే బాలీవుడ్ అనగానే ఈ ఢిల్లీ భామ కాస్తంత గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రకుల్ ను చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. డీప్ నెక్ క్లీవేజ్ చేస్తూ చూపరులకు బాగా షాక్ ఇచ్చింది. మొత్తానికి రకుల్ బాలీవుడ్ లో జోరు పెంచడానికి సిద్దమైందన్న మాట.