ఆ సినిమా కోసం ఆ ముగ్గురు..

SMTV Desk 2018-06-08 16:38:26  manchu lakshmi, wife of ram movie, upasana, namratha, lakshmi pranathi.

హైదరాబాద్, జూన్ 8 : వినూత్న రీతిలో ప్రాజెక్టులను పట్టాలేక్కిస్తూ తనదైన శైలిలో నటనలో రాణిస్తున్న ప్రముఖ కథానాయిక మంచు లక్ష్మీ. జయాపజయాలతో సంబంధం లేకుండా తనే సొంతంగా సినిమాలను నిర్మించుకుంటూ వస్తున్నారు. గత కొన్నేళ్లుగా లక్ష్మి చేసిన ప్రయోగాలు చాలానే ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మీ విజయ్ యలకంటి దర్శకత్వం వహిస్తున్న 'వైఫ్ ఆఫ్ రామ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక భార్య పాత్రలో లక్ష్మీ దర్శనమివ్వనుంది. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ కు లక్ష్మీ భారీ ప్రయత్నాలే చేస్తున్నట్లుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు లాంచ్ కు శిల్పా రెడ్డి, రకుల్ ప్రీత్, స్వప్న దత్ లు అతిథులుగా వచ్చారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం త్వరలోనే నమ్రత, ఉపాసన, నారా బ్రాహ్మణి కూడా సాయం చేయనున్నట్లు సమాచారం. మరి ఇంతమంది ప్రమేయం ఉన్న ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను పెంచుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.