ఆడవాళ్ల ద్వీపానికి యునెస్కో గుర్తింపు

SMTV Desk 2017-07-12 11:45:03  japan tokiyo, tempul seea, East sea,Prohibition of Eastern Sagittarius

టోక్యో : జూలై 12 : జపాన్ లోని ద్వీపదేవతాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ద్వీపదేవతకు తరతరాలుగా జపానీస్ మతపెద్ద ఒకరు నిత్యం 365 రోజులూ పూజలు జరుపుతుంటారు. ఇక్కడి క్షేత్రంలో అడుగుపెట్టాలంటే ముందు తప్పని సరిగా సముద్రంలో నగ్నంగా స్నానమాచరించి వెళ్లాల్సి ఉంటుంది. జపాన్ తూర్పు సముద్రంలో ఉన్న ఈ ద్వీపంలో 2 గంటల పాటు వార్షిక ఉత్సవానికి మాత్రమే పరిమిత సంఖ్యలో మగవాళ్లను అనుమతిస్తుంటారు. ఈ ద్వీపానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఒకినోషిమా ద్వీపంలోకి మహిళల నిషేధం, శతాబ్దాల తరబడి కొనసాగుతున్న ఆచారం. మహిళలు అడుగుపెట్టడానికి వీళ్లేకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తే ఈ ద్వీపం పాడయ్యే అవకాశముండటంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్యను పరిమితం చేస్తుంటారు. వేలాదిగా బంగారు ఉంగరాలు , విలువైన వస్తువులు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈద్వీపానికి సముద్రం గుండా ప్రయాణం చేయడం మహిళలకు ప్రమాదకరం. బిడ్డలకు జన్మనిచ్చే మహిళా లోకాన్ని కాపాడుకోవడమే నిషేధం వెనుక పరమార్ధంగా చెబుతుంటారు. ప్రయాణం భద్రంగా సాగాలని ప్రార్ధిస్తూ భక్తులే ఉంగరాలు , విలువైన వస్తువులను క్షేత్రం లో వేస్తుంటారు. భవిష్యత్తులో మతపెద్దలు మినహా మిగతావారందరిపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. యునస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా విశ్వఖ్యాతికి అర్హమైన ప్రాంతాలున్నాయి. తాజాగా బ్రిటన్ లోని డిస్టిక్ట్ డియోడీ, జేనిఇరియోలోని వలోంగ్ నౌకాశ్రయం, పసిఫిక్, మహా సముద్ర దక్షిణ ప్రాంతంలో ముక్కోణాకారంలో కలిసే మూడు ద్వీపాల సమూహం కూడా జాబితాలో చేర్చారు. ఆడవాళ్లకు ప్రవేశం లేని జపాన్‌లోని ఓ చిన్న ద్వీపమైన ఒకినోషిమాకు ప్రపంచ వారసత్వ ప్రాంత హోదాను యునెస్కో ప్రకటించింది.