ప్రధాని పదవికి రాజీనామా చేసిన ముల్కీ..

SMTV Desk 2018-06-04 18:57:29  Jordan PM Hani al-Mulki, Jordan PM Hani al-Mulki resign, jordan, King Abdullah

జోర్డాన్, జూన్ 4 : జోర్డాన్ దేశ ప్రధాని హని ముల్కీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తీసుకున్నకొన్ని నిర్ణయాల వల్ల పన్నుల పెంపు, పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మద్దతుతో ప్రవేశపెట్టిన కొత్త పన్ను బిల్లును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొత్త ట్యాక్స్ విధానం వల్ల ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ ఆ బిల్లు వల్ల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతాయని ఆందోళనకారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఆ ట్యాక్స్ బిల్లు.. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా లేదన్నారు. గత కొన్ని రోజులగా భారీ స్థాయిలో ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఐఎంఎఫ్ మద్దతుతో ప్రవేశపెట్టిన ట్యాక్స్ బిల్లును రద్దు చేసేందుకు ప్రధాని ముల్కీ వ్యతిరేకించారు.ఇటీవల కింగ్ అబ్దుల్లా.. ముల్కీకి సమన్లు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ముల్కీ తన పదవికి రాజీనామా చేశారు.