సన్నీకి సారీ చెప్పిన రాఖీసావంత్..

SMTV Desk 2018-06-04 12:50:11  sunnyleone, rakhi saavanth, rakhi say sorry to sannyleone.

ముంబై, జూన్ 4 : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ స్టార్ రాఖీసావంత్.. హాట్ బ్యూటీ సన్నీలియాన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఇటీవల రాజీవ్ ఖండేల్ వాలా చాట్ షో లో పాల్గొన్న రాఖీ.. సన్నీ గురించి తెలుసుకోకుండా ఆమెపై విమర్శలు చేశానని గుర్తు చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 11 పోటీదారు అర్షిఖాన్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఖీ మాట్లాడుతూ.. "సన్నీలియాన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాను. ఆ సమయంలో నాకు తను అన్ని కష్టాలు పడిందని తెలీదు. ఇలా ఆమె గురించి ఏమి తెలుసుకోకుండా ఆమె సాగించిన ప్రయాణం గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని.. అప్పట్లో అలా మాట్లాడి ఉండకూడదని తెలిపింది. ఇందుకు సన్నీలియాన్ నన్ను క్షమించాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది.