కార్తి చిత్రంలో తమిళ అగ్ర హీరో..!!

SMTV Desk 2018-06-04 11:44:03  karthi, hero vishal, director mitran, karthi new movie.

చెన్నై, జూన్ 4 : ప్రముఖ తమిళ కథానాయకుడు కార్తి.. పాండిరాజ్‌ దర్శకత్వంలో "కడైకుట్టి సింగం" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక వ్యవసాయదారుడిగా కనిపించనున్నారు కార్తి. ప్రస్తుతం నిర్మాణా౦తర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కార్తి నటించనున్న మరో చిత్రంలో తమిళ అగ్ర కథానాయకుడు కనిపించనున్నట్లు తెలుస్తోంది. "ఇరుంబుతిరై" చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న హీరో విశాల్.. కార్తి చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్లు సమాచారం. మిత్రన్‌ దర్శకత్వంలో ఓ కథ సిద్దంగా ఉండడంతో స్వయంగా విశాల్.. ఆ కథను కార్తికి వినిపించమని చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మిత్రన్‌ చెప్పిన కథ కార్తికి నచ్చడంతో ప్రాజెక్టు ఓకే అయింది. దీంతో తమిళంలో మంచి మిత్రులుగా కొనసాగుతున్న వీరిద్దరూ సినిమాలోనూ అదే స్నేహాన్ని కొనసాగించనున్నారన్న మాట.