ఆమీర్ ఖాన్ పై మండిపడుతున్న నెటిజన్లు..

SMTV Desk 2018-05-31 17:24:36  amir khan trolled, amir khan, amir khan trolled by netizens, mumbai

ముంబై, మే 31 : బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. తాజాగా మన మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం అతను చాలా కాలం తరువాత షూటింగ్ లకు బ్రేక్ చెప్పి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను కొన్ని ఫొటోల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. అయితే ఇటీవల అమిర్ ఖాన్ నుంచి వచ్చిన ఒక ఫొటో కాంట్రవర్షియల్ గా మారింది. ఆ ఫోటోలో ఆమీర్‌ కూతురు ఇరా, తన తండ్రిపై కూర్చొని ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ హ్యాపీ మూమెంట్ పై కొందరు తప్పుబడుతున్నారు. ఈడుకోచ్చిన ఆడపిల్లతో అమిర్ అలా సరదాగా చేసినప్పటికీ ఆ ఫొటో ఇంటర్నెట్ లోవిడుదల చేయాల్సింది కాదని మరి కొందరు అంటున్నారు. పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటీ? అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలోకి మతాన్ని లాగొద్దంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక అందరికి ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. కూతురు అయినందుకేనా అమిర్ ఖాన్ ను అలా అంటున్నారు. అతని కూతురిని అతను ఇష్టంగా చూసుకున్నా తప్పేనా? ఒకవేళ ఆ స్థానంలో అబ్బాయి ఉంటే బావుండేదా.. అని మండిపడ్డాడు.