ఇక్కడ అంత సులువు కాదు అంటున్న రకుల్ !!!

SMTV Desk 2017-07-09 17:00:43  rakul prith sing, 100 cros

హైదరాబాద్, జూలై 09 : ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ లలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఒకరు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దు గుమ్మ చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న రకుల్‌.. త్వరలోనే నీరజ్‌పాండే దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది. అయితే నటిగా ఈ స్థాయికి చేరుకునేందుకు తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు రకుల్‌. ఈ నేపధ్యంలో తన అనుభూతులను ఇలా పంచుకుంది. నటిగా గుర్తింపు తెచ్చే పాత్రల్లోనే నటించాలని సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే నిర్ణయించుకున్నా. 100 కోట్లు సంపాదించే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వాళ్లకి అవకాశాలు రావడం అంత సులువు కాదని నాకు తెలుసు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నేను అనుకున్న దిశగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చా. గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నా. టాలీవుడ్‌లో స్టార్‌ నటులను.. కొత్త నటులను ఒకేవిధంగా చూస్తారు. ఇక్కడ టాలెంట్‌ను ఎంతో గౌరవిస్తారు. కాకపోతే ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్లూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. అలాగే ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్లొ అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పింది ఈ పంజాబీ భామ.