ఆ హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్

SMTV Desk 2017-07-09 16:38:25  MegaStar, which, made, the, heroine, beautiful

హైదరబాద్, జూలై 9 : "ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, బిగ్‌బాస్" ఇలా మూడు హిట్ సినిమాల్లో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి, రోజా ఆ తర్వాత ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆ అవకాశమే రాలేదు. అయితే, చిరు150వ సినిమా ప్రచారం కోసం ఇద్దరూ ఓ ఇంటర్వ్యూలో కలిశారు. చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన రోజా ఆయనను పొగడ్తల్లో ముంచెత్తారు. తాజాగా ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. ఓ షోలో పాల్గొన్న రోజాను చిరు వీడియో బైట్ ద్వారా పొగడ్తల్లో ముంచెత్తారు. సీనియర్ నటి సుహాసిని తమిళంలో హోస్ట్ చేస్తున్న టీవీ షోలో రోజా పాల్గొన్నారు. చిరు రోజా గురించి ఏమంటున్నారనే విషయాన్నీ ఈ షోలో ప్లే చేశారు. రోజా అనే రెండక్షరాలు తెలుగు, తమిళనాడు రాష్టాల్లో బాగా పాపులర్ కావడానికి ఆమెలో ఉన్న అందం, ఆత్మవిశ్వాసం అనే రెండు లక్షణాలు మా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా "ముఠామేస్త్రీ లో రోజాను చూశాక అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఆమెలో ఉందని నాకు అర్థమైంది. నాతో మొదటిసారి డ్యాన్స్ చేస్తున్నా కూడా తను ఎక్కడా భయపడలేదు. ఎంత కష్టమైన స్టెప్స్ ఉన్న కూడా ఒకసారి గమనించి తప్పులేకుండా చేసేది. హార్డ్‌వర్క్ చేసేవాళ్లు ఆటోమెటిక్‌గా సక్సెస్ అవుతారు. ఒక శ్రేయోభిలాషిగా నీ లక్ష్యాలను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని రోజాను విష్ చేశారు.