మరీ ఇన్ని ఆంక్షలా?

SMTV Desk 2017-07-08 18:30:43  nayanatara, Too, much,

హైదరరాబాద్, జూలై 08 : దక్షిణాన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఓ సినిమా ఒప్పుకోవాలంటే చాలా కండీషన్లు పెట్టడమేకాకా "ప్రమోషన్లకు రాదు'. అంతేకాకుండా భారీగా పారితోషకం అందించాల్సిందే. నయన పెట్టే కండీషన్లు అంగీకరించే నిర్మాతలు ఆమె దగ్గరకి వెళ్తుంటారు. ఇదిలా ఉండగా నయనతార కేవలం తెలుగు సినిమాలకే షరతులు విధిస్తుంటుంది అన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అదే తమిళ సినిమాలకు ఇందుకు మినహాయింపుగా ఉంటుంది. తమిళ సినిమాలకు ప్రచారం కోసం ప్రత్యేకంగా పారితోషకం ఇస్తుంటారు. అలాంటి ప్యాకేజీనే నయనకు తెలుగు చిత్రసీమ ఇవ్వాలని నిర్ణయించుకొందట. కాగా తను నటించిన ఆరడుగుల బుల్లెట్టు విడుదలకు సిద్ధంగా అవుతుంది. అంతే కాదు ఇప్పుడు బాలయ్య సినిమాలోను నటించడానికి ఒప్పుకుంది. ఈ రెండు సినిమాలకు పారితోషకంతో పాటు ప్రచారం కోసం ప్రత్యేకమైన రుసుము చెల్లించడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. అటు తమిళంలోనూ నయన ఇదే పద్దతి అనుసరిస్తుందని, అక్కడ ప్రచార రుసుము మరింత ఎక్కువని తెలుస్తుంది.