"రాజుగాడు" థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్..

SMTV Desk 2018-05-12 12:23:58  raj tarun, rajugadu movie, thiyetrical trailar, amiar dasturi.

హైదరాబాద్, మే 12 : యువ నటుడు రాజ్ తరుణ్.. సంజనా రెడ్డి దర్శకత్వంలో "రాజుగాడు" చిత్రంలో నటిస్తున్నాడు. రాజ్‌ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటించింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు గోపీచంద్ సంగీతం అందించారు. అయితే హీరో రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్.. "రాజుగాడు" చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ దొంగతనాలు చేస్తూ కనిపించాడు. అతను అతనికి తెలియకుండానే దొంగతనాలు చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో హీరోయిన్ ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే రాజ్ తరుణ్ తన స్నేహితుడితో.. "ఒక అమ్మాయి వచ్చి నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే.. నా కళ్ళు తన కళ్ళు చూడాలి కాని.. అదేంట్ర తన మేడలో చైన్, చేతులకు గాజులు, చెవులకు దుద్దులు చూస్తాయి" అంటూ చెబుతున్న తీరు ఎంతో హాస్యాస్పదంగా ఉంది.