సర్.. ఈ రోజుకి ఇది చాలు : రాహుల్ రవీంద్రన్

SMTV Desk 2018-05-08 12:38:03  chilasow, rahul ravindran, chlasow teaser, nagarjuna whishes.

హైదరాబాద్, మే 8: అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం "చి ల సౌ". ఈ చిత్రంలో సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్లు టీజర్ బాగుందంటూ తెగ కామెంట్లు చేశారు. కొంతమంది సెలెబ్రేటిస్ సైతం టీజర్ చాలా బాగుందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ టీజర్ ను చూసిన అక్కినేని నాగార్జున.. "ఈ తాజా టీజర్ చూసి నవ్వుకున్నా.. టీజర్ చాలా బాగుంది" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి రాహుల్ రవీంద్రన్ తెగ సంబరపడిపోతున్నారు. "సర్ మీరే స్వయంగా ట్వీట్ చేశారంటే.. ఇంక ఈ రోజుకి ఇది చాలు.." అంటూ రిప్లై ఇచ్చారు.