రెజీనా తొలిసారిగా..!!

SMTV Desk 2018-05-06 11:32:13  heroine rejina, tamil dabbing, mister chandramouli movie.

హైదరాబాద్, మే 6 : హీరోయిన్ రెజీనా.. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలలో నటిస్తూ వచ్చింది. కాని ఈ అమ్మడుకి అనుకున్నంత సక్సెస్ మాత్రం వరించలేదు. ఇటీవల "అ" చిత్రంలో ఒక విభిన్నమైన పాత్ర పోషించి మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా తమిళ్ లో "మిస్టర్ చంద్రమౌళి" చిత్రంలో హాట్ హాట్ గా పోస్ ఇస్తూ కుర్రకారును పిచ్చెక్కించింది. అంతేకాకుండా బికినీలో కూడా దర్శనమిచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ భామ తెలుగులో తన సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదు. కాని ఈ తమిళ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తను డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరు దర్శకత్వం వహిస్తున్న "మిస్టర్ చంద్రమౌళి" చిత్రంలో గౌతం కార్తీక్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ధనంజయన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.