సావిత్రి పెళ్లి ఎలా బయటకు వచ్చిందంటే..!!

SMTV Desk 2018-05-04 17:44:11  savitri marriage, lux soap brand ambassadress, jemini ganeshan.

హైదరాబాద్, మే 4 : మహానటి సావిత్రి జీవితంలోని ప్రతి ఘట్టం అపురూపమే. ఆమె జీవిత కథతో మహానటి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సావిత్రి జెమిని గణేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాని ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు. నిజానికి ఆమె పెళ్లి చేసుకునే సమయానికి సావిత్రి సూపర్ స్టార్. అందువల్ల అందరికి తెలియాలనుకోలేదేమో. ఇంతకు ఆమె పెళ్లి విషయం బయటకు ఎలా వచ్చిందంటారా.? ఆ సమయంలో లక్స్ సోప్ యాజమాన్యం సావిత్రిని తమ ప్రాడక్ట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ చేసుకు౦దట. ఆ కాంట్రాక్ట్ మీద సైన్ కోసం సావిత్రిని సంప్రదించగా ఆమె అనుకోకుండా "సావిత్రి గణేశన్" అని సైన్ చేశారట. దీంతో ఆమె పెళ్లి విషయం కాస్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.