దీపికా రణవీర్‌ ల పెళ్లి డేట్ ఫిక్స్..!

SMTV Desk 2018-05-04 14:40:41  DIPIKA PADUKONE, RANVEER SINGH, MARRIAGE DATE FIX.

ముంబై, మే 4 : బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె, హీరో రణవీర్‌ సింగ్ ల పెళ్లిపై రోజుకో వార్త దర్శనమిస్తోంది. ఈ విషయంపై ఇద్దరు అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు కాని.. వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీపిక, రణవీర్‌ల నుంచి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. దీప్‌వీర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని, నవంబర్‌లో వీరి వివాహం ఉండబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో మేకప్ ఆర్టిస్ట్ ల నుండి మేనేజర్ వరకూ సెలవులు కోరవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయట. ఒకవేళ అదే నిజమైతే నవంబర్ లో ఈ జంట పెళ్ళితో ఒక్కటవనున్నారన్నమాట.