ఆడపిల్ల పుట్టడమే ఒక అవార్డులాంటిది : సుస్మితా సేన్

SMTV Desk 2018-04-30 17:22:06  susmitha sen, iam women award show,

ముంబై, ఏప్రిల్ 30 : దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్ల పుట్టడమే ఒక అవార్డులాంటిదన్నారు. ముంబైలో "ఐ యామ్‌ వుమెన్" అనే అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుస్మితా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఆడపిల్లగా పుట్టడమే నా జీవితంలో నేను అందుకున్న గొప్ప అవార్డు. ఆడవారి ప్రతిభను గుర్తించి అవార్డులు ఇవ్వడం అద్భుతం. ఈ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది" అన్నారు. అలాగే అత్యాచారాల గురించి రాస్తావిస్తూ.. "ఇలాంటి విషయాల గురించి నా అభిప్రాయాన్ని వెల్లడించడం మానేశాను. దేశంలో నేరాలకు పాల్పడే వారి గురించి కాకుండా.. మహిళలకు సాయం చేస్తూ, వారికి మద్దతుగా నిలిచే మగవారిపై ఎక్కువ దృష్టిసారించాలి. దేశ భవిష్యత్తు యువత తీసుకునే నిర్ణయంపైనే ఉంది" అని వెల్లడించారు.