ఆకట్టుకుంటున్న "సంజూ" టీజర్‌..

SMTV Desk 2018-04-24 16:20:19  SANJU TEASER, SANJAY DATT, SANJAY LIFE STORY,RANBEER KAPOOR.

ముంబై, ఏప్రిల్ 24 : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా "సంజూ" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ టీజర్‌ ను రిలీజ్ చేసింది. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ టీజర్‌ లో.. "నా జీవితం తెరిచిన పుస్తకం. ఇందులో ఎత్తుపల్లాలను, ఉన్నత శిఖరాలను, అగాధాలను చవిచూశాను. లంగ్స్ పాడయ్యేలా డ్రగ్స్ తీసుకున్నాను. డాక్టర్ కూడా బతికించలేమన్నాడు... కానీ మహ్మదాలీకి పోటీగా బాడీని పెంచాను. చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కాను.. బస్ టికెట్ కోసం నడిరోడ్డు మీద భిక్షమెత్తాను.. కిటికీలోంచి ప్రపంచం మొత్తాన్ని చూశాను.. అసలు కిటికీయే లేని గదుల్లోనూ ఉన్నాను" అంటూ చెబుతున్న డైలాగులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ టీజర్‌ లోనే సంజయ్ జీవితం ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో మనిషా కోయిరాలా, అనుష్క శర్మ, సోనం కపూర్, దియా మీర్జా, బోమన్ ఇరాని తదితరులు ముఖ్య పాత్రాలు పోషించారు. ఈ చిత్రాన్ని జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.