చిరు మెచ్చిన భరత్..!!

SMTV Desk 2018-04-24 14:48:51  bharath ane nenu, chiranjivi praise the movie, mahesh babu, dvv danaaiah,

హైదరాబాద్, ఏప్రిల్ 24 : "భరత్ అనే నేను" చిత్ర౦ విడుదలైన నాటి నుండి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్ర౦ విమర్శకుల ప్రశంసలు సైతం అ౦దుకుంటోంది. అలాగే యువ ముఖ్యమంత్రిగా మహేష్ నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుండి అనేక ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిత్ర౦పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు. "ఇంత మంచి సినిమాను రూపొందించినందుకు మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేయడం ఆనందం కలిగించింది. దాదాపు ఈ సినిమా గురించి ఓ పది నిమిషాలు చర్చించారు. ఫస్ట్ డే నే త‌న కుటుంబ సభ్యులతో క‌లిసి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూశారని, అప్పుడే నాకు ఫోన్ చేసి చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు" అని తెలిపారు.