ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే : ప్రియప్రకాష్

SMTV Desk 2018-04-23 16:22:41  priya prakash varier, oru adar love, roshan abdul rahuf, roshan birthday wishes.

హైదరాబాద్, ఏప్రిల్ 23 : ఓర చూపుతో కుర్రకారు మతి పోగొట్టిన మలయాళ నటి ప్రియ ప్రకాష్. ఆమె కథానాయికగా నటించిన "ఒరు అదర్ లవ్" చిత్రంలోని ఓ పాటలో కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్డం తెచ్చుకున్న కథానాయిక. ఆ చిత్రంలో తను పలికించిన హావభావాలకు అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. అంతలా ఆకట్టుకుంది. అయితే ఈరోజు ప్రియకు ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజట. ఇంతకి ఆ వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా.? మరెవరో కాదు.. "ఒరు అదార్‌ లవ్‌" కథానాయకుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌. ఈ సందర్భంగా ప్రియప్రకాష్ తన ట్విట్టర్ వేదికగా తనకు శుభాకాంక్షలు తెలిపారు. "నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? ఎందుకంటే మీకందరికీ తెలుసు" అని ట్వీట్ చేశారు. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 3న విడుదల కావాల్సి ఉంది. కాని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని జూన్ కు వాయిదా వేశారు.