మరోసారి తేజ దర్శకత్వంలో రానా..!!

SMTV Desk 2018-04-23 14:36:24  DIRECTOR TEJA, RANA DAGGUBATI RANA, NEW MOVIE.

హైదరాబాద్, ఏప్రిల్ 23 : దగ్గుబాటి రానా, తేజ దర్శకత్వం లో తెరకెక్కిన "నేనే రాజు నేనే మంత్రి" చిత్రం మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంతో ఈ మూవీ సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రానా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ పాత్రలో కనిపించనున్నారట. ముంబైకు చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సరిగ్గా ఇదే కథాంశంతో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి తేజ ఈ చిత్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దనున్నారోనని ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం తేజ నందమూరి తారకరామారావు జీవిత కథాంశంతో "ఎన్టీఆర్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం రానాతో ప్రాజెక్టుపై అధికారిక౦గా ప్రకటించనున్నారు.