హైదరాబాద్, ఏప్రిల్ 23 : "తొలిప్రేమ" తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న భామ రాశీకన్నా.. హాట్ హాట్ పిక్స్ తో మతిపోగొడుతోంది. తాజాగా రాశీకన్నా తీసుకున్న ఫోటోషూట్ ను చేస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అంతలా తన అందాలతో ఆకట్టుకుంది. రెడ్ కలర్ మోడ్రన్ డ్రస్ అండ్ స్పైసీ లుక్ లో తానూ తీసుకున్న ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ అమ్మడు. ఇప్పటి వరకు తనలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా తన గ్లామర్ రోల్స్ ను ప్రదర్శించింది. అలాగే రాశీకన్నా ఈ ఫోటోతో పాటు.. "బాడీ షేప్ కు తగ్గట్టుగా డ్రస్ ఉండాలి. అంతేకానీ డ్రస్ కు తగినట్టు బాడీ షేప్ ఉండదు" అని కామెంట్ చేసింది. ప్రస్తుతం రాశీ ఖన్నా నితిన్ సరసన శ్రీనివాస కళ్యాణం లో హీరోయిన్ గా నటిస్తోంది.