సుకుమార్ మహేష్ కాంబినేషన్ లో మూవీ..!!

SMTV Desk 2018-04-22 17:05:51  mahesh babu, sukumar, mahesh babu new movie.

హైదరాబాద్, ఏప్రిల్ 22 : యువ ముఖ్యమంత్రి గా నటించి "భరత్ అనే నేను" చిత్రంతో మహేష్ బాబు రికార్డులు సృష్టిస్తున్నాడు. మరోవైపు "రంగస్థలం" విజయోత్సవంలో తేలిపోతున్నారు దర్శకుడు సుకుమార్. ఇద్దరు కలిసి చెరొక హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు ఇదివరకే ఆ నిర్మాణ సంస్థలో "శ్రీమంతుడు" చిత్రంలో నటించారు. మళ్లీ ఈ సినిమాతో మైత్రీతో అనుబంధం కొనసాగనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.