డ్రాగన్ పడవ పోటీల్లో అపశ్రుతి..

SMTV Desk 2018-04-22 16:55:14  Dragon boat disaster, south china boat accident, Taohua river, bejing

బీజింగ్‌, ఏప్రిల్ 22 : దక్షిణా చైనాలో జరుగుతున్నా డ్రాగన్‌ పడవ పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పోటీలకు ముందస్తు సాధన చేస్తున్న రెండు పడవలు నదిలో మునిగి 17 మంది మృతి చెందారు. గులిన్‌ నగరంలోని తెహిజియాన్‌ నదిలో రెండు పడవల్లో 57 మంది ఔత్సాహికులు పోటీల కోసం సాధన చేస్తుండగా ఈ విషాద ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది నదిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు 40 మందిని కాపాడారు. అనుమతులు లేకుండా పడవ పోటీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.