రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరలు

SMTV Desk 2018-04-22 15:55:53  petrol price, bjp, central govt, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెట్రోల్‌ ధరలు తొలిసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.74.04కు చేరగా, డీజిల్‌ ధర ఏకంగా లీటరు రూ.65.65 చేరి, ఆల్‌టైమ్‌ రికార్డు ధరను నమోదు చేసింది. ఈ భారం వినియోగదారులపై భారం పడకుండా ఉండాలంటే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడమే ఏకైక మార్గం. ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలన్నీగతేడాది జూన్‌ నుంచి రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు పెట్రోల్‌ ధర 19 పైసలు పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శనివారం పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచారు.