కచ్చితంగా చూడాల్సిన వీడియో : అల్లు శిరీష్

SMTV Desk 2018-04-22 15:32:32  Allu shireesh, dasari narayana rao video, allu shireesh twitter.

హైదరాబాద్, ఏప్రిల్ 22 : కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ, తమకు అన్యాయం జరిగిందంటూ ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణల వెనుక నిజం ఎంత.? అబద్దం ఎంత? అనే విషయాలను బహిర్గతం చేయకుండానే కొన్ని మీడియా ఛానళ్లు సమావేశాలు ఏర్పాటు చేసి దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావును గుర్తు చేసుకున్నారు. ఓ సినిమాలో దాసరి చెప్పిన డైలాగ్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో పాటు.. "చిత్ర పరిశ్రమ అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు అయిపొయింది. 30 ఏళ్ల ముందు సినీ పరిశ్రమ గురించి దాసరి గారు చెప్పిన మాటలు నేటికి సరిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన మా దగ్గర లేరు. కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది" అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో దాసరి సినీ పరిశ్రమ గురించి ఎంతో ఆవేశంతో చెప్తున్న మాటలు అక్షరాల ప్రస్తుత పరిస్థితికి అడ్డం పడుతున్నాయి. మీరూ ఒకసారి చూడండి.