ఆ మరణశిక్ష వెనుక ఉన్నది అతనే..

SMTV Desk 2018-04-22 13:56:29  Alakh Alok Srivastava, lawyer behind the PIL for death to rapists, kathua, newdelhi

హైదరాబాద్, ఏప్రిల్ 22 : ప్రస్తుతం దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దారుణమైన ఘోరం ఏంటంటే... ముక్కుపచ్చలారని పసిపిల్లలను కూడా వదలట్లేదు. సమాజంలో ఎటువంటి భయం లేకుండా కొంత మంది రాక్షసులల ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారికి మరణశిక్ష విధించడమే సబబు. కానీ ధైర్యం చేసేదే ఎవరు..! 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలనే ఆలోచన ఆయనే ఢిల్లీలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనతో చలించిపోయిన శ్రీవాస్తవ ఇకపై కామాంధులకు ఉరి శిక్ష పడాలని కోర్టుకెళ్లారు. ఆలోచన అక్కడి నుంచే పుట్టింది.. ఢిల్లీలో ఎనిమిది నెలల చిన్నారిపై సమీప బంధువు చేసిన అత్యాచార ఘటన గురించి అలోక్‌ వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్నారు. దీంతో వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను కలిసి ఘటన గురించి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఈకేసును తానే వాదించనున్నట్లు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసేవారికి మరణశిక్ష విధించాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. దీనికి తోడు ఇటీవల కథువా చిన్నారి దుర్ఘటన కూడా తోడవ్వడంతో ఆయన పోరాటానికి మరింత బలం వచ్చింది. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేయాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో లైంగిక నేరాల నుంచి చిన్నారుల పరిరక్షణ చట్టం(పోక్సో)ను సవరించి నిందితులకు ఉరిశిక్ష పడేలా శనివారం కేంద్రం ఆమోద ముద్ర వేసింది.