గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ

SMTV Desk 2018-04-22 13:12:06  ap cm chandrababu naidu, meet governor Narsinhan

విజయవాడ, ఏప్రిల్ 22 : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు విజయవాడలో భేటీ అయ్యారు. నగరంలోని గేట్ వే హోట ల్ లో నరసింహన్ ని కలిసిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. విశాఖ పర్యటన ముగించుకున్న గవర్నర్‌ నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కీలక పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.