గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

SMTV Desk 2018-04-22 11:23:29   governer narashihan, ap cm chandrababu, Vijayawada Airport

అమరావతి, ఏప్రిల్ 22: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించవచ్చని సమాచారం. గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది.