ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా : వర్మ

SMTV Desk 2018-04-21 11:14:58  director ram gopal varma, pawan kalyan, varma promiss.

హైదరాబాద్, ఏప్రిల్ 21 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నటి శ్రీరెడ్డితో అనుచిత వ్యాఖ్యలు చేయించింది తానేనని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తానూ చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. ఇంకోసారి మెగా కుటుంబాన్ని, అల్లు కుటుంబాన్ని ఉద్దేశించి ఎలాంటి ధూషణలు చేయనని తన తల్లిపై ఒట్టేస్తున్నా అని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మెగా ఫ్యామిలీతో కలిసి ఫిలింఛాంబర్‌ ఎదుట పవన్‌ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా పవన్ వెనుక ఎవరున్నారో తెలియాలి అంటూ చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వర్మ మరోసారి స్పందించారు. "నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. పీకే మీద ఎలాంటి కామెంట్ చేయనని మా మదర్ మీద ఒట్టేశాను. అయినా నేను.. సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవి ప్రకాష్‌, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడంతో మా మదర్‌ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టుమీద పెట్టాను" అంటూ ట్వీట్‌ చేశారు.