చెన్నై బ్యాటింగ్

SMTV Desk 2018-04-20 19:56:48  ipl, chennai super kings, rajastan royals, dhoni

పూణే, ఏప్రిల్ 20 : ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య పూణే వేదికగా మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి రహానే ప్రత్యర్ధిని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. చెన్నై జట్టులోకి మురళీ విజయ్‌ స్థానంలో తిరిగి సురేశ్‌ రైనా, హర్భజన్‌ స్థానంలో కర్ణ్‌శర్మ ఆడనున్నట్టు ధోనీ తెలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌లో షార్ట్‌ స్థానంలో క్లాసెక్‌, ధవళ్‌ కుల్‌కర్ణి స్థానంలో స్టువర్ట్‌ బిన్నీ స్థానం దక్కించుకొన్నారు.