దీక్ష విరమించిన చంద్రబాబు

SMTV Desk 2018-04-20 19:22:39  ap cm chandrababu naidu, 12 hours, hunger strike

విజయవాడ, ఏప్రిల్ 20: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష ను విరమించారు. ఇద్దరు చిన్నారులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును పలువురు నేతలు అభినందించారు. కాగా, విజయవాడ మున్సిపల్ మైదానంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పన్నెండు గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగింది. ఆయన దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లోనూ మంత్రులు దీక్షలు చేపట్టారు.