అది ప్రతీకార పిటిషన్‌ : అరుణ్‌జైట్లీ

SMTV Desk 2018-04-20 18:15:34  deepak mishra, arun jaitley, cji deepak mishra, congress

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : గత కొన్నిరోజులుగా సుప్రీం కోర్టు వ్యవహారాల్లో జరుగుతున్నా పరిణామాలు ఎప్పుడు లేని విధంగా న్యాయవ్యవస్థ పై నమ్మకాన్ని సన్నగిల్లేల చేస్తున్నాయి. తాజాగా సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఉద్వాసనకై విపక్షాలు ఏకంగా అభిశంసన అస్త్రం గురిపెట్టాయి. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలు అభిశంసనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ అది ప్రతీకార పిటిషన్‌ అని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఒక న్యాయమూర్తిని ఒత్తిడికి గురిచేసి ఇతర న్యాయమూర్తులకు ఎలాంటి సంకేతాలు పంపుతారని ప్రశ్నించారు. జస్టిస్‌ బీహెచ్‌ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన వెనువెంటనే ఈ తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తించాలని జైట్లీ అన్నారు. న్యాయమూర్తిని అభిశంసించాలన్న విపక్షాల వ్యూహం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెనుముప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.