బ్యూటీ లుక్స్ కు సింపుల్ టిప్స్..

SMTV Desk 2018-04-20 17:06:51  simple beauty tips, face pack, hyderabad, maskara process

హైదరాబాద్, ఏప్రిల్ 20 : మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని లైట్ గా మాయిశ్చరైజర్ రాయండి. మాయిశ్చరైజర్ ఆయిల్ ఫ్రీది అయి ఉండాలి. దీనిని ఫౌండేషన్ గా వాడవచ్చు. >> మీ చర్మానికి కలిసిపోయే రంగులో వున్న ఫౌండేషన్ అప్లై చేయాలి. లిక్విడ్ బేస్డ్ కానీ, వాటర్ బేస్డ్ కానీ అయి ఉంటె మంచిది. >> ముఖం మీద మచ్చల లాంటివి ఏమైనా ఉంటే వాటిని కవర్ చేసేందుకు కన్సీరల్ ఉపయోగించండి. చెవుల వెనుక రాయడం మర్చిపోకండి. >> కనురెప్పలకు ఐ షాడో అప్లై చేయాలి. కనురెప్పలు కొంచెం కర్ల్ చేసి మస్కారా రాయాలి. ఐ లాష్ బ్రష్ తో కనురెప్పలు బ్రష్ చేసి కావాలంటే కాటుక పెట్టండి. ఉదయం అయితే లైట్ కలర్, సాయంత్రమైతే డార్క్ కలర్ ఐ లైనర్స్ అప్లై చేయాలి. >> పెదవులపై, బుగ్గలపై బ్లషర్ తో పైకి స్ట్రోక్ ఇవ్వండి. మొదటి లిప్ లైనర్ తర్వాత లిప్ స్టిక్ పైన లిప్ స్టిక్ పైన లిప్ లైనర్ తో పెదవులు అలకరించండి.