నా కన్నీళ్ళు ఆగడం లేదు : బాబి

SMTV Desk 2018-04-20 14:13:03  DIRECTOR BABI, EMOTIONAL TWEET, PAWAN KAYAN,

హైదరాబాద్, ఏప్రిల్ 20 : ప్రముఖ దర్శకుడు బాబి పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలను ఉద్దేశించి భావోద్వేగపు ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో "ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే నన్ను నేను నియంత్రించుకోలేక‌పోతున్నా. నా కన్నీళ్లు ఆగడం లేదు. గడిచిన 48 గంటలు నా జీవితంలో ఎంత క్లిష్టంగా గడిచాయో. నేను మీతో కలిసి పని చేశాను. మీరు ఆడవారికి ఎంత రక్షణగా ఉంటారో నాకు తెలుసు. మీకంటే ఎక్కువ మేము బాధపడుతున్నాం. మీకు నా సెల్యూట్" అంటూ పోస్ట్ చేశారు. బాబి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన మాటలపై ఇది వరకే పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.