చంద్రబాబుకు మోదీ గ్రీటింగ్స్!

SMTV Desk 2018-04-20 13:07:40  Prime Minister of India modi, Birthday wihes, ap cm chandrababu

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో మోదీకి, చంద్రబాబుకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు మోదీని చంద్రబాబు ఏదో ఒక సందర్భంలో బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది.