‘ధర్మపోరాట దీక్ష’ను ప్రారంభించిన చంద్రబాబు

SMTV Desk 2018-04-20 12:38:40  ap cm chandrababu, Dharma Porata Deeksha.

విజయవాడ, ఏప్రిల్ 20: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ధర్మపోరాట దీక్ష’ను ప్రారంభించారు. స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 7గంటలకు బాబు దీక్షను చేపట్టారు. అశేష అభిమానుల మధ్య దీక్ష వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ..’ పాటతో దీక్ష ప్రారంభమైంది. టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. చంద్రబాబుకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షను పార్టీ శ్రేణులు ప్రారంభించాయి. కాగా సీఎం ధర్మ పోరాట దీక్షకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇది ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.