అల్లు విమర్శలపై.. వర్మ సమాధానాలు..

SMTV Desk 2018-04-20 12:29:55  allu aravindh,ram gopal varma, varma clarification, pawan kalyan.

హైదరాబాద్, ఏప్రిల్ 20 : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్‌ విమర్శలకు వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.. "శ్రీరెడ్డి విషయంలో స్పందించని అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ అనగానే చాలా వేగంగా స్పందించారు. "శ్రీరెడ్డి అభిరాం లీక్స్ లో సురేష్ తో మాట్లాడి 5 కోట్లు ఇప్పించటానికి ట్రై చేస్తానని చెప్పాను.. అంతే కానీ పవన్ కి, ఆ 5 కోట్లకి సంబంధం లేదు. పవన్ కల్యాణ్ కు లక్ష మంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ ను అంత మాట అనిపించి నాకు నేను మాత్రమే ద్రోహం చేసుకుంటున్నా.! అంతేకాని ఇండస్ట్రీకి ఎలా ద్రోహం చేస్తున్నా.? నిజానికి తప్పు నాదే. క్షమించరాని నేరమే. అల్లు అరవింద్.. మీకు, పవన్ కల్యాణ్ కు, మీ కుటుంబ సభ్యులకు, ఫాన్స్ కు అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. మళ్లీ ఎప్పుడూ పవన్‌ మీద, అరవింద్‌ కుటుంబ సభ్యుల మీద నెగిటివ్‌ కామెంట్స్‌ పెట్టను" అంటూ వెల్లడించారు.