నీచపు వర్మ.. నీ వెనక ఎవరున్నారు : అల్లు అరవింద్

SMTV Desk 2018-04-20 11:38:36  allu aravindh, ram gopal varma, pawan kalyan, varma comments.

హైదరాబాద్, ఏప్రిల్ 20 : పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో శ్రీరెడ్డి తో దుర్భాషలాడి౦చిన నీచుడు రామ్ గోపాల్ వర్మ అంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన వర్మ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్మ పోస్ట్ చేసిన వీడియో చూశాను ఎంతో బాధపడ్డానని వాపోయారు. ఆ వీడియోలో వర్మ మాట్లాడిన మాటలకు అరవింద్ ఘాటుగా స్పందించారు. "వర్మ పవన్ పై ఎందుకు ఇంత కక్ష కట్టాడు.? కావాలనే శ్రీరెడ్డితో అనరాని ఆ మాటని వర్మ అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ పవన్ ను అన్న మాటను తన తల్లినో., అక్కనో., కూతురో.. వారిలో ఎవర్నో ఒకర్ని మేం అనుంటే ఆ బాధేంటో ఆయనకు తెలిసుండేది. శ్రీరెడ్డి వ్యవహారంలో రాజీ కుదర్చడానికి సురేష్‌ బాబుతో మాట్లాడి, రూ.5 కోట్లు ఇప్పిస్తానని చెప్పాడట. ఈ విషయమై సురేష్‌బాబుతోనూ అతని కుటుంబ సభ్యులతోనూ మాట్లాడా. మేం అటువంటి హామీ ఇవ్వలేదని, ఆ విషయమై చట్టబద్దంగానే వ్యవహరిస్తామని అన్నారు. వర్మ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. రూ.5 కోట్ల ఫండ్‌ ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కల్యాణ్‌పై చేసిన ఈ కుట్రల వెనుక వర్మ వెనుక కూడా ఇంకా ఎవరు ఉన్నారు? అని ప్రశ్నించారు. పరిశ్రమలో చర్చనీయాంశమైన లైంగిక వేధింపులపై కూడా అల్లు అరవింద్ స్పందించారు. "ఈ లైంగిక వేధింపుల వ్యవహారం విషయంలో కూడా సినీ పరిశ్రమ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాష్‌ కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, కార్మికులు ఎవరు తప్పు చేసినా వారిని తొలగించేందుకు చర్య తీసుకుంటుంది. ఆ కమిటీ ద్వారా ఇంకా కొన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.