రాజధాని నిర్మాణం మాత్రం ఆగదు : చంద్రబాబు

SMTV Desk 2018-04-19 18:08:32  ap cm, amaravathi construction, central government, chandrababu meeting.

అమరావతి, ఏప్రిల్ 19 : ఏపీలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధుల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినా.. ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం ఆగదని.. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర౦ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రాజధాని నిర్మాణంపై రాష్ట్ర పజలలో అనేక సమస్యలు, సందేహాలు తలెత్తాయని అన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి ప్రజలే ముందుకొచ్చి నిధులు సమకూర్చేందుకు సిద్ధమవడం విశేషం. ప్రజల్లో ఉన్న విశ్వాసం సడలకుండా రాజధాని పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు సహకరించాలని కోరారు.