నెటిజన్ల సాయం కోరిన నటి శిల్పాశెట్టి..

SMTV Desk 2018-04-19 16:32:23  shilpa shetty, simba cat missing, shilpa instagram post.

ముంబై, ఏప్రిల్ 19 : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నెటిజన్ల సాయం కోరింది. తానూ ఎంతగానో ఇష్టపడి పెంచుకున్న సింబా(పెంపుడు పిల్లి) కనిపించకుండా పోయిందంటూ ఆవేదనతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్‌ చేశారు. "డియర్ ఫాన్స్.. నా పెంపుడు పిల్లి సింబా కనిపించడం లేదు. నిన్నటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రాలేదు. అది నిన్నటి నుండి ఏమి తినలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే ముందుగా దానికి ఏదైనా తినిపించండి. నాకు చాలా బాధగా ఉంది. సింబా హిమాలయన్‌ పర్షియన్‌ జాతికి చెందింది. మీరు దానిని గుర్తుపట్టడానికి వీలుగా ఫొటో కూడా పోస్ట్‌ చేశాను. మీలో ఎవరికైనా కనిపిస్తే నాకు సమాచారం అందించండి" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.