భర్తపై గృహహింస కేసు పెట్టిన ప్రముఖ మోడల్

SMTV Desk 2017-07-04 18:43:33  model, hasbend, arested, wife,

ముంబై జూలై 4 : ప్రముఖ సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ 9వ సీజన్ లో మెరిసిన ఇరానియన్ మోడల్ అయిన మందనా కరిమి, ముంబై కి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ తో రెండేళ్ళ పాటు సహజీవనం చేసి ఈ ఏడాది మొదటి మాసంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్త, అతని కుటుంబం తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ముంబై లోని అందేరి మేజిస్ట్రేట్ కోర్టులో తన భర్త అతని కుటుంబం పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన భర్త తనను సినిమాలు ఆపేయాలని, అలాగే మతాన్ని కూడా మార్చుకోవాలని బలవంతం చేస్తున్నారని పేర్కొంది. భర్త నుంచి నష్టపరిహారం ఇప్పించాలని అలాగే నెలవారీ ఖర్చుల కోసం రూ.10 లక్షలు ఇవ్వాలని పిటీషన్ వేసింది. కాగా మందన "క్యా కూల్ హై 3" వంటి చిత్రాల్లో నటించారు.